ఆర్థిక భరోసా కల్పించిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు 

4 Apr, 2020 18:44 IST

 అనంతపురం : రాష్ట్రంలో ప్రతి పేద కుటుంబానికి రూ. వెయ్యి ఇచ్చి ఆర్థిక భరోసా కల్పించిన ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి ఎమ్మెల్సీ షేక్‌ మహ్మద్‌ ఇక్బాల్‌ కృతజ్ఞతలు తెలిపారు.  శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. కరోనా నియంత్రణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. కరోనా కట్టడికి సీఎం వైయస్‌ జగన్ అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. కోవిడ్‌-19తో ఇంటికే పరిమితం అయిన పేదలకు ఉచితంగా రేషన్ అందజేయడం అభినందనీయమన్నారు.