ఆధునాతన పారిశుధ్య యంత్రాల ప్రారంభం
3 Sep, 2020 14:36 IST
విజయవాడ : అధునాతన పారిశుధ్య యంత్రాలను మంత్రి బొత్స సత్యనారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా విఎంసీ తరుపున కొత్త టెక్నాలజీతో ఏడు కొత్త వాహనాలను కొనుగోలు చేశామని మున్సిపల్ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ తెలిపారు. వీటి ద్వారా కాలువల పూడికలను సులువుగా తీయోచ్చని పేర్కొన్నారు. జెసిబీలో మూడు మినీ వాహనాలు, కొత్తగా మూడు నాళామేన్ వాహనాలను కొనుగోలు చేసినట్లు చెప్పారు. మూడు క్లీనింగ్ యంత్రాలను సైతం అందుబాటులోకి తెస్తున్నామని వివరించారు. ఈ కొత్త యంత్రాల వల్ల పని వేగవంతమవుతుందని, సమయం కూడా ఆదా అవుతుందన్నారు.