లడ్డూ అంశాన్ని డైవర్షన్ చేయడం కోసం మాజీ మంత్రులపై దాడులు
11 Feb, 2026 12:12 IST
అమరావతి: అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయెల్ తిరుపతి లడ్డూపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని కఠినంగా విమర్శించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, లడ్డూలో ఎలాంటి జంతువుల కొవ్వు కల్తీ లేవని సీబీఐ తన రిపోర్ట్‌లో స్పష్టంగా చెప్పింది. లడ్డూ వివాదాన్ని దైవర్షన్ చేయడానికి, ముఖ్యంగా మాజీ మంత్రులపై చర్యలు తీసుకోవడం రాజకీయ ఉద్దేశ్యం అని బొమ్మి ఇజ్రాయెల్ ఆరోపించారు. చంద్రబాబు నాయుడు ఇప్పటికీ ఇలాంటి దుర్మార్గ చర్యలను నిలిపివేయాలని, ప్రజల సమస్యలను అణచివేయకుండా, సమాధానాత్మకంగా వ్యవహరించాలని సూచించారు. చంద్రబాబు చేస్తున్న అన్యాయాలకు త్వరలోనే ప్రజలు బుద్ధి చెప్పే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు.