చంద్రబాబు నీచ రాజకీయాలు మానుకోవాలి
13 May, 2020 10:58 IST
విజయవాడ: ప్రతిపక్ష నేత చంద్రబాబు తీరుపై వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు. చంద్రబాబు నీచ రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. సీఎం వైయస్ జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు చూసి టీడీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని పేర్కొన్నారు.టీడీపీ నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు.