ప్రజలు చీదరించుకున్న బాబుకు బుద్ధిరాలేదు
29 Feb, 2020 11:42 IST
కర్నూలు: ప్రజా చైతన్య యాత్రల పేరుతో చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నాడని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్‌రెడ్డి ధ్వజమెత్తారు. ప్రజలు చీదరించుకున్న చంద్రబాబుకు ఇంకా బుద్ధిరాలేదన్నారు. కర్నూలులో ఎమ్మెల్యే రవిచంద్రకిషోర్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రాంతీయ విభేదాలు తీసుకువచ్చేందుకు బాబు కుట్ర చేస్తున్నాడన్నారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే ధృడ సంకల్పంతో ప్రభుత్వం ముందుకుపోతుందన్నారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని ప్రజలంతా హర్షిస్తుంటే చంద్రబాబు ఒక్కరే వ్యతిరేకిస్తున్నారన్నారు. అందుకే విశాఖలో చంద్రబాబును రాష్ట్ర ప్రజలు అడ్డుకున్నారన్నారు.