కరోనా నియంత్రణలో సీఎం వైయస్ జగన్ దేశానికే ఆదర్శం
అమరావతి: కరోనా నియంత్రణలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి దేశానికే ఆదర్శంగా నిలిచారని ఏపీఐఐసీ చైర్‌పర్సన్, వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా పేర్కొన్నారు. మంగళవారం మంత్రి పేర్ని నానితో కలిసి ఎమ్మెల్యే రోజా అంబులెన్స్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం వైయస్ జగన్ ప్రజా ఆరోగ్య విషయంలో ఎంత శ్రద్ధ తీసుకుంటున్నారో రోజా వివరించారు. ఆరోగ్య విషయంలో దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి ఒక్క అడుగు ముందుకు వేస్తే..సీఎం వైయస్ జగన్ మరో రెండు అడుగులు ముందుకు వేశారని చెప్పారు. రూ.1000 వైద్య ఖర్చు దాటితే ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చారని తెలిపారు. దేశంలోనే అత్యధిక కరోనా టెస్టులు చేసిన రాష్ట్రం ఏపీనే అన్నారు. గత ప్రభుత్వం 108, 104 అంబులెన్స్‌లను నిర్లక్ష్యం చేస్తే..సీఎం వైయస్ జగన్ కొత్త వాటిని తెచ్చి ప్రజలకు ఆరోగ్యభద్రత కల్పిస్తున్నారని చెప్పారు.