రెడ్డి శాంతి కుమార్తె వివాహానికి సీఎం వైయ‌స్ జగన్‌కు ఆహ్వానం 

6 Oct, 2021 11:21 IST

తాడేప‌ల్లి: పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి కుమార్తె, ఐఏఎస్‌ అధికారి రెడ్డి వేదిత వివాహ రిసెప్షన్‌ నవంబర్‌ 9న పాతపట్నంలో జరగనుంది. ఈ వేడుకకు రావాలని కోరుతూ.. ఎమ్మెల్యే రెడ్డి శాంతి ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలసి ఆహ్వానపత్రికను అందజేశారు. సీఎంను కలిసిన వారిలో ఎమ్మెల్యేతో పాటు ఆమె కుమారుడు రెడ్డి శ్రావణ్‌కుమార్‌ ఉన్నారు.