ఎన్నికల కమిషనర్‌కు ప్రజల ఆరోగ్యం పట్టదా?

9 Jan, 2021 11:22 IST

విజయవాడ: ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌కు ప్రజల ఆరోగ్యం పట్టదా అని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి ప్రశ్నించారు. కోర్టు ఆదేశాలు కాదని నిమ్మగడ్డ ఏకపక్షంగా వ్యవహిస్తున్నారని విమర్శించారు. వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో ప్రభుత్వ యంత్రాంగమంతా నిమగ్నమై ఉందన్నారు. ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి ఎన్నికలు నిర్వహించాలనుకోవడం సరికాదన్నారు.