కోవిడ్ సెంటర్కు ఎమ్మెల్యే నల్లపురెడ్డి రూ.2లక్షల విరాళం
30 Apr, 2021 12:55 IST
నెల్లూరు: సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి స్ఫూర్తిగా వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు కోవిడ్ నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నారు. నెల్లూరు జిల్లా రామచంద్రాపురంలోని కోవిడ్ కేర్ సెంటర్కు కొవ్వూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి రూ.2 లక్షల విరాళం అందజేశారు. నల్లపురెడ్డి శ్రీనివాసులురెడ్డి ట్రస్ట్ తరఫున కోవిడ్ సెంటర్కు ఆర్థిక సాయం అందించి ఎమ్మెల్యే దాతృత్వాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా కోవిడ్ కేర్ సెంటర్ను పరిశీలించి, అక్కడ అందుతున్న సేవలను తెలుసుకుని సిబ్బందిని ఎమ్మెల్యే అభినందించారు.