మున్సిపల్ ఎన్నికల్లో వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీదే విజయం
25 Feb, 2021 11:54 IST
విశాఖ: మున్సిపల్ ఎన్నికల్లో వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీదే విజయమని వైయస్‌ఆర్‌సీపీ ఎస్సీ సెల్‌రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే మేరుగ నాగార్జున ధీమా వ్యక్తం చేశారు. కరోనా సమయంలో చంద్రబాబు పక్క రాష్ట్రంలో దాక్కున్నారని విమర్శించారు. ఎన్నికలు రాగానే చంద్రబాబుకు కుప్పం ప్రజలు గుర్తుకొచ్చారని ధ్వజమెత్తారు.