నాణ్యమైన కరెంట్‌ ఇవ్వాలంటే సౌర విద్యుత్‌ తప్పనిసరి 

2 Dec, 2020 10:14 IST


అమ‌రావ‌తి: ఏపీ ఎలక్ట్రిసిటీ సవరణ డ్యూటీ బిల్లుతో రాష్ట్రానికి మంచి జరుగుతుందని ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి అభిప్రాయపడ్డారు. బిల్లు చదవకుండా ప్రతిపక్ష సభ్యులు అనవసరంగా మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. రైతులకు పగటిపూట నాణ్యమైన కరెంట్‌ ఇవ్వాలంటే సౌర విద్యుత్‌ తప్పనిసరి అన్నారు. సౌర విద్యుత్‌తో పర్యావరణానికి, రైతులకు మంచి జరుగుతుందని తెలిపారు. టీడీపీ నాయకులు కుట్రపూరితంగా మంచి పనులకు అడ్డుతగులుతున్నారని మండిపడ్డారు.