హైకోర్టు తీర్పు రాజ్యాంగేతర శక్తులకు చెంపపెట్టు
11 Jan, 2021 19:14 IST

విజయవాడ: ఎన్నికల షెడ్యూల్‌ను హై కోర్టు సస్పెండ్ చేయటం ప్రజా విజయం అని ఎమ్మెల్యే జోగి రమేష్ అన్నారు. ఇది నియంతృత్వ పోకడలకు పోయే రాజ్యాంగేతర శక్తులకు చెంపపెట్టు లాంటిదని పేర్కొన్నారు. ప్రజావిశ్వాసం పొందిన సీఎం వైయస్ జగన్‌ని కుట్రలతో ఎదుర్కొవాలనుకోవాలనుకోవడం మూర్కత్వం అని తెలిపారు. ఏపీ హైకోర్టు తీర్పు చారిత్రాత్మకం అని, ఎన్నికల కంటే ప్రజల ప్రాణాలే ముఖ్యమని హైకోర్టు స్పష్టం చేయటాన్ని స్వాగతిస్తున్నామని ఎంపీ తలారి రంగయ్య అన్నారు. నిమ్మగడ్డ రమేష్ ఇప్పటికైనా రాజ్యాంగ బద్ధంగా వ్యవహరించాలన్నారు.