ఆరోగ్యశ్రీ పథకాన్ని చంద్రబాబు అనారోగ్యశ్రీగా మార్చారు

అమరావతి: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి పేదలకు కార్పొరేట్ వైద్యం అందించేందుకు అమలు చేస్తే..చంద్రబాబు దాన్ని అనారోగ్యశ్రీగా మార్చారని వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే జగన్ మోహన్ రావు విమర్శించారు. గురువారం అసెంబ్లీలో ఎమ్మెల్యే మాట్లాడారు. చంద్రబాబు హయాంలో 108, 104 వాహనాలను మూలనపడేశారని మండిపడ్డారు. గతంలో 296 నెట్ వర్క్ ఆసుపత్రులు ఉంటే..ఆ సంఖ్య వైయస్ జగన్ ముఖ్యమంత్రి కాగానే 1400కు పెంచారన్నారు. గతంలో వెయ్యి వ్యాధులకు ఆరోగ్యశ్రీలో వైద్యం అందిస్తుంటే..ఇప్పుడు 2436 వ్యాధులకు చికిత్సలు అందజేస్తున్నారు. ఆరోగ్యశ్రీ కార్డుల పరిమితిని 1.11 కోట్లకు పెంచారని తెలిపారు.ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు ఎలా ఉన్నాయో నిత్యం పరిశీలిస్తున్నాం. నెట్‌వర్క్ ఆసుపత్రులను నిత్యం సమీక్షిస్తున్నామన్నారు. 5225 మంది పేషేంట్లు ఇతర రాష్ట్రాల్లో చికిత్సలు పొందారని ఎమ్మెల్యే జగన్‌మోహన్‌రావు వివరించారు.