వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలనడం సిగ్గుచేటు
తిరుపతి: వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని చంద్రబాబు అనడం సిగ్గుచేటని వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రాభివృద్ధిపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదన్నారు. చంద్రబాబు టైంపాస్ రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. గతంలో అందరూ కలిసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్‌ను అభివృద్ధి చేశారన్నారు. రాష్ట్రం విడిపోయిన తరువాత ఎంత నష్టపోయామో ఇప్పుడుఅర్థమైందన్నారు. ఇలాంటి పరిస్థితి రాకూడదనే..అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలనే ఆలోచనతో సీఎం వైయస్ జగన్ పాలనా వికేంద్రీకరణ చట్టం రూపొందించారన్నారు. వైయస్ జగన్ నిర్ణయాన్ని మేధావులు, ప్రజాస్వామ్యవాదులు అభినందించారని, గవర్నర్ న్యాయ సలహాలు తీసుకొని బిల్లుకు ఆమోదముద్ర వేశారన్నారు. వైయస్ జగన్ ఏం చేసినా చంద్రబాబు విమర్శించడమే పనిగా పెట్టుకున్నారన్నారు.