సీఎం వైయస్ జగన్‌ను కలిసిన ఎమ్మెల్యే భూమన
26 Dec, 2022 18:01 IST
తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డిని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి కలిశారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్ జగన్‌ను శాసనసభ్యులు భూమన కరుణాకర రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పలు అంశాలపై వారు చర్చించారు.