వారం ముందే సంక్రాంతి
చిత్తూరు: జగనన్న అమ్మ ఒడిని ప్రారంభించడంతో జిల్లాలో సంక్రాంతి పండుగ వారం ముందే వచ్చిందని ఎమ్మెల్యే ఏ.శ్రీనివాసులు తెలిపారు. జగనన్న అమ్మ ఒడి కార్యక్రమం చిత్తూరులో ప్రారంభించడం సంతోషంగా ఉంది. మహానేత వైయస్‌ఆర్ కూడా ఇదే జిల్లాలో ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టారు. కుప్పంలో ఆ పథకాన్ని ప్రారంభించారు. మన జిల్లాకు వైయస్‌ఆర్ కుటుంబం అంత ప్రాధాన్యత ఇవ్వడం సంతోషంగా ఉంది. పిల్లలు చదువుకుంటేనే బాగుపడుతారని భావించి ప్రతి ఏటా తల్లులకు రూ.15 వేలు ఇస్తానని వైయస్ జగన్ పాదయాత్రలో హామీ ఇచ్చారు. ఆ హామీని మన జిల్లాలో అమలు చేయడంతో అందరం సీఎం వైయస్ జగన్‌కు రుణపడి ఉంటాం. విద్యా, సంక్షేమం, అభివృద్ధిని దశలవారీగా సీఎం కాగానే అమలు చేస్తూ సుపరిపాలన అందిస్తున్నారు. చిత్తూరుకు స్కిల్ డెవలప్‌మెంట్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని సీఎంను కోరుతున్నాం. తాగునీరు, సాగునీటి సమస్యను కూడా పరిష్కరించాలని, రింగ్‌రోడ్డు కనెక్టివిటీ ఏర్పాటు చేయాలని సీఎంను కోరారు. ఫైఓవర్లు కూడా పూర్తి చేస్తామని సీఎం హామీ ఇచ్చారని తెలిపారు. జగనన్న..వర్ధిల్లు అన్నా అంటూ ఆకాంక్షించారు.