అశోక్ నగర్ బ్రిడ్జిని పరిశీలించిన ఎమ్మెల్యే అనంత
9 Dec, 2023 17:17 IST
అనంతపురం: నగరంలోని అశోక్‌నగర్‌లో నూతనంగా నిర్మించిన బ్రిడ్జిని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి శనివారం పరిశీలించారు. అశోక్ నగర్ మొదటి క్రాస్‌కు వెళ్లేందుకు దారి సరిగా లేకపోవడంతో అధికారులతో మాట్లాడారు. ఇక్కడ వాహన రాకపోకలు సాగేలా చర్యలు తీసుకోవాలని కాంట్రాక్టర్, అధికారులకు సూచించారు. అందుకు అనుగుణంగా అలైన్‌మెంట్ చేయాలన్నారు. అదేవిధంగా బ్రిడ్జి పక్కన డ్రెయినేజీని పరిశీలించి మురుగునీరు సాఫీగా ముందుకు సాగేలా చూడాలన్నారు. ఎమ్మెల్యే వెంట కార్పొరేటర్ సైఫుల్లా బేగ్, పబ్లిక్ హెల్త్ ఈఈ సతీష్, నగర పాలక సంస్థ ఈఈ సూర్యనారాయణ, డీఈ సుభాష్, వైయస్ఆర్ సీపీ నేతలు ఆలమూరు శ్రీనివాసరెడ్డి, రవి, జావీద్ తదితరులు ఉన్నారు.