కరోనా కాదు..క్యాస్ట్ వైరస్ వల్లే ఎన్నికలు వాయిదా
16 Mar, 2020 12:20 IST

తాడేపల్లి: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా కరోనా వల్ల కాదని, క్యాస్ట్ వైరస్ వల్లేనని వైయస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. ఏవిధమైన చర్చలు జరపకుండా ఎన్నికలు వాయిదా వేయడం సరికాదన్నారు. రాష్ట్రంలో కరోనా ప్రభావం లేదని తెలిపారు. ఎన్నికలు వాయిదా వేయడం వల్ల కరోనా ఆగిపోతుందా అని ప్రశ్నించారు. వ్యవస్థలను మేనేజ్ చేయడం చంద్రబాబు కొత్తేవి కాదన్నారు.