చర్చలను అడ్డుకోవడం సరికాదు
23 Mar, 2022 10:06 IST
అమరావతి: అసెంబ్లీలో పేదల ఇళ్లకు సంబంధించిన చర్చ జరుగుతుంటే టీడీపీ సభ్యులు అడ్డుకోవడం సరికాదని ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి అన్నారు. టీడీపీ సభ్యుల తీరు ఏమాత్రం మారడం లేదని అసహనం వ్యక్తం చేశారు. స్పీకర్ పోడియం వద్ద టీడీపీ సభ్యుల అనుచిత ప్రవర్తనకు పాల్పడటం దురదృష్టకరమన్నారు. పేదల ఇళ్ల విషయంలో ప్రశ్నోత్తరాలు జరుగుతుండగా అడ్డుకునే ప్రయత్నం చేయటం ఏంటని ప్రశ్నించారు.