దేశంలోనే ఏపీ నంబర్ వన్ అవుతుంది
24 Feb, 2020 12:17 IST
విజయనగరం: దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి మొదటి స్థానంలో నిలుపుతారని మంత్రి పినిపే విశ్వరూప్ అన్నారు. విజయనగరం సభలో ఆయన మాట్లాడుతూ..జగనన్న వసతి దీవెన అనే అద్భుతమైన పథకాన్ని రాష్ట్రంలో ప్రారంభించడం మా అందరి అదృష్టంగా భావిస్తున్నాం. ఇప్పటికే నాడు-నేడు ద్వారా పాఠశాలల రూపురేఖలు మార్చేశారు. అమ్మ ఒడి ద్వారా ఆర్థిక చేయూత నందించారు. రాబోయే రోజుల్లో ఏపీని దేశంలోనే మొదటి స్థానంలో నిలుపుతారని విశ్వాసం వ్యక్తం చేస్తున్నాను. మీరు చేస్తున్న కృషికి మా అభినందనలు, కృతజ్ఞతలు తెలుపుతున్నాం.