ఏకగ్రీవాలపై రాద్దాంతం తగదు
6 Feb, 2021 12:24 IST
విజయవాడ: పంచాయితీ ఎన్నికల్లో ఏకగ్రీవాలు అనేవి ఈ రోజు వచ్చినవి కావని, వాటిపై రాద్దాంతం చేయడం తగదని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. ప్రభుత్వంపై బురద జల్లే ఉద్దేశ్యంతో టీడీపీ అధినేత చంద్రబాబు, ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ ఏక గ్రీవాలపై రాద్దాంతం చేస్తున్నారన్నారు. ఏకగ్రీవాలతో పంచాయితీకి నిధులు సమకూరుతాయన్నారు. అభివృద్ధి జరుగుతుందని.. అయినా అంతిమంగా న్యాయమే గెలుస్తుందన్నారు. అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని మంత్రి వెల్లంపల్లి తెలిపారు.