వైయస్‌ఆర్..రైతుల కలను నెరవేరుస్తున్న సీఎం వైయస్ జగన్
28 Feb, 2020 16:05 IST
పశ్చిమ గోదావరి: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి, రైతుల కలను సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి నెరవేరుస్తున్నారని మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. 2021 కల్లా పోలవరం పూర్తయ్యేలా ప్రణాళిక సూచించారని మంత్రి తానేటి వనిత తెలిపారు. సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి పోలవరంపై విస్తృతంగా సమీక్షించారని చెప్పారు. ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశించారని చెప్పారు. పోలవరం రివర్స్ టెండరింగ్‌లో రూ.630 కోట్లు ఆదా చేసిన ఘనత సీఎం వైయస్ జగన్‌దే అన్నారు. చంద్రబాబు పోలవరం పేరుతో దోపిడీ చేశారని విమర్శించారు.