ప్రజలు చంద్రబాబును ఎప్పుడో క్విట్ చేశారు
28 May, 2022 15:00 IST
విజయవాడ: ప్రతిపక్ష నేత చంద్రబాబును ఎప్పుడో ప్రజలు క్విట్ చేశారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. 2024 ఎన్నికలే చంద్రబాబుకు చివరి ఎన్నికలని తెలిపారు. వెన్నుపోటు పొడిచి ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని మండిపడ్డారు. ఎన్టీఆర్ మరణానికి చంద్రబాబే కారణమని చెప్పారు. ఎన్టీఆర్ను స్మరించే అర్హత చంద్రబాబుకు లేదన్నారు.