అన్ని ప్రాంతాల అభివృద్ధే సీఎం వైయస్ జగన్ ఆలోచన
3 Aug, 2020 14:07 IST
విజయవాడ: అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నదే సీఎం వైయస్ జగన్ ఆలోచన అని మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు. అభివృద్ధి అంటే శిలాఫలకాలు వేయడమని చంద్రబాబు అనుకుంటున్నారని విమర్శించారు. అన్ని ప్రాంతాలను దృష్టిలో పెట్టుకొని సీఎం వైయస్ జగన్ పాలన సాగిస్తున్నారని చెప్పారు. విశాఖపట్నం పరిపాలన రాజధానిగా ఉంటే తక్కువ సమయంలో అభివృద్ధి చెందిన రాష్ట్రాలతో పోటీ పడవచ్చని కొడాలి నాని పేర్కొన్నారు.