వరదలను రాజకీయం చేస్తున్న టీడీపీ
16 Jul, 2022 11:57 IST
కోనసీమ: వరదలను టీడీపీ రాజకీయం చేయాలని చూస్తోందని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మండిపడ్డారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా రైతులకు 80 టన్నుల పశుగ్రాసాన్ని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అందజేశారు. లంక గ్రామాల్లో ప్రభుత్వం 20 మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసినట్లు మంత్రి వెల్లడించారు. ప్రజలను ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు.