పేదవాడి సొంతింటి కల నెరవేర్చాలన్నదే సీఎం వైయస్ జగన్ లక్ష్యం
30 Dec, 2020 11:30 IST
విజయనగరం: పేదవాడి సొంతింటి కల నెరవేర్చాలన్నదే సీఎం వైయస్ జగన్ లక్ష్యమని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. నవరత్నాలు– పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా కొత్త ఊరునే తయారు చేస్తున్నామని చెప్పారు. ఇవాళ ఇళ్ల నిర్మాణ పనులను ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభిస్తున్నారని చెప్పారు.సీఎం చేతుల మీదుగా గుంకలాంలో 12.301 మంది లబ్ధిదారులకు ఇళ్లపట్టాలు పంపిణీ చేస్తున్నామని చెప్పారు. 397.36 ఎకరాల్లో అతిపెద్ద లే అవుట్ ఏర్పాటు చేశామని, వైయస్‌ఆర్– జగనన్న కాలనీ పైలాన్‌ను సీఎం ఆవిష్కరిస్తారని చెప్పారు. ఆరు బ్లాకులుగా రూ.4.37 కోట్లతో లే అవుట్ అభివృద్ధి చేస్తున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు.