హిడెన్ స్ప్రౌట్స్‌ని రాజకీయం చేయడం తగదు
8 Jun, 2021 17:46 IST
విశాఖ: హిడెన్ స్ప్రౌట్స్ వ్యవహారాన్ని తెలుగుదేశం నాయకులు రాజకీయం చేయడం తగదని మంత్రి అవంతి శ్రీనివాస్ పేర్కొన్నారు. జగనన్న తోడు పథకం కింద 22 కోట్ల 37 లక్షల నగదు చెక్కులను మంగళవారం చిరు వ్యాపారులకు మంత్రి అందజేశారు. ఈసందర్భంగా మంత్రి అవంతి మీడియాతో మాట్లాడుతూ.. తెలుగుదేశం హయాంలోనే హిడెన్ స్ప్రౌట్స్ భూమి రెగ్యులరైజ్ చేయాల్సిoది కదా అని ప్రశ్నించారు. ప్రతి అంశాన్ని రాజకీయం చేయడం పక్క రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు నాయుడుకు అలవాటని మంత్రి అవంతి శ్రీనివాసరావు ఎద్దేవా చేశారు.