టీడీపీ పరిస్థితి ఏంటో అచ్చెన్నాయుడు చెప్పారు
19 Apr, 2021 15:28 IST
విశాఖ: టీడీపీ పరిస్థితి ఏంటో అచ్చెన్నాయుడే చెప్పారని మంత్రి అవంతి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఏ ఎన్నికైనా వైయస్ఆర్ సీపీదే గెలుపు అని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. సోమవారం అవంతి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ.. తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఓటమిని ఒప్పుకునే ధైర్యం లేదన్నారు. చంద్రబాబు అప్పట్లో నేతలను తిట్టేవారు.. ఇప్పుడు ప్రజలను తిడుతున్నారని వ్యాఖ్యానించారు.సీఎం వైయస్ జగన్‌కు ఓటేస్తే చెడ్డవాళ్లు.. టీడీపీకి ఓటేస్తే మంచివాళ్లా? అని మంత్రి నిలదీశారు.