బెంగాల్, ఒడిషాలో పరిశ్రమ పెట్టుకోవచ్చు కదా
12 Feb, 2021 11:34 IST
విశాఖపట్నం: బెంగాల్, ఒడిషా రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం పరిశ్రమ పెట్టుకోవచ్చు కదా అని మంత్రి అవంతి శ్రీనివాస్ పేర్కొన్నారు. భూములు కాజేయాలని పోస్కో యత్నిస్తోందని విమర్శించారు. శుక్రవారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ ..ప్రజల ఆస్తిని ప్రైవేట్‌పరం చేసే హక్కు ప్రధానికి ఉండదని అన్నారు. ఇవాళ వైయస్ఆర్‌సీపీ ఎంపీలు కేంద్ర మంత్రి అమిత్ షాను కలుస్తున్నారని..త్వరలోనే ప్రధానిని కూడా కలుస్తారని తెలిపారు. పక్క రాష్ట్ర కేంద్ర మంత్రి వల్ల ఇదంతా జరుగుతోందని ఆరోపించారు. పవన్ కల్యాణ్ కూడా పోరాటానికి కలిసిరావాలని అవంతి శ్రీనివాస్ పిలుపునిచ్చారు.