మద్యం, డబ్బు లేని ఎన్నికలు సామాజిక మార్పునకు నాంది
7 Mar, 2020 16:09 IST
విశాఖ: మద్యం, డబ్బు లేకుండా ఎన్నికలు జరపాలని సీఎం వైయస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయం సామాజిక మార్పునకు నాంది అని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైయస్ఆర్ సీపీ ఘన విజయం సాధిస్తుందని, సీఎం అమలు చేస్తున్న పథకాలే వైయస్ఆర్ సీపీకి అధికారాన్ని కట్టబెడతాయన్నారు. విశాఖ జెడ్పీ చైర్ పర్సన్ పదవి గిరిజన మహిళకు కేటాయించడం సంతోషంగా ఉందన్నారు.