టీడీపీ, జనసేన పొత్తును తిరస్కరిస్తున్నారు!
8 Dec, 2023 12:50 IST
పల్నాడు: విశాఖలో గురువారం పవన్ కళ్యాణ్ నిర్వహించిన సభకు జనాలు మొహం చాటేశారు. జనాలు లేక బహిరంగ సభ ప్రాంగణం వెలవెలబోయింది. ఖాళీ కుర్చీలతో దర్శనమిచ్చింది. జనాలు లేక రెండు గంటలకుపైగా పవన్ కల్యాణ్ హోటల్ కే పరిమితమయ్యారు. గ్రౌండ్‌లో సగం వరకే కుర్చీలు వేసిన జనాలు కనిపించలేదు. జనాలను తీసుకురాలేక జనసేన నేతలు చేతులు ఎత్తేశారు. ఈ ఘటనపై మంత్రి అంబటి రాంబాబు ట్విట్టర్ వేదికగా స్పందించారు.
పవన్ సభలకు జనం మందగిస్తున్నారు!
అంటే పొత్తుని తిరస్కరిస్తున్నారని అర్థం! అంటూ మంత్రి అంబటి రాంబాబు తన ఎక్స్(ట్విట్టర్)లో పోస్టు చేశారు.