ముంపు ప్రాంతాల్లో మంత్రి ఆళ్ల నాని పర్యటన
17 Aug, 2020 12:21 IST
పశ్చిమ గోదావరి: వరద ముంపు ప్రాంతాల్లో డిప్యూటీ సీఎం ఆళ్ల నాని పర్యటించారు. వరద ప్రభావంతో కోతకు గురవుతున్న గట్లను ఆళ్ల నాని పరిశీలించారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ముంపు గ్రామాల ప్రజలనుసురక్షిత ప్రాంతాలకు తరలించాలని, అధికారులు ఎప్పటికప్పుడు వరద ప్రభావంపై సమీక్ష నిర్వహించాలని సూచించారు. పోలీసు, రెవెన్యూ శాఖ సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు.