టీడీపీ, బీజేపీ, జనసేన అజెండా ఒక్కటే
4 Oct, 2021 12:12 IST
వైయస్‌ఆర్ జిల్లా: టీడీపీ, బీజేపీ, జనసేన అజెండా ఒక్కటేనని మంత్రి ఆదిమూలపు సురేష్ విమర్శించారు. గత ప్రభుత్వాలు బద్వేల్‌ను పట్టించుకోలేదన్నారు. బద్వేల్ రైతాంగానికి సాగునీరు అందించబోతున్నామని చెప్పారు. రూ.130 కోట్లతో బద్వేల్ మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న బద్వేల్ రెవెన్యూ డివిజన్‌ను ప్రభుత్వం మంజూరు చేసిందని చెప్పారు. బద్వేల్ ప్రాంత నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామన్నారు.