పరిస్థితులను బట్టి టెన్త్, ఇంటర్ పరీక్షలపై నిర్ణయం
22 Apr, 2021 17:07 IST
మంగళగిరి: కరోనా నేపథ్యంలో అప్పటి పరిస్థితిని బట్టి టెన్, ఇంటర్ పరీక్షలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. పరీక్షలపై టీడీపీ నేత నారా లోకేష్ వ్యాఖ్యలను మంత్రి తీవ్రంగా ఖండించారు. లోకేష్ వ్యాఖ్యలు విద్యార్థుల ఆత్మస్థైర్యాన్ని తగ్గించే విధంగా ఉన్నాయని తప్పుపట్టారు. ప్రభుత్వ చర్యలు లోకేష్‌కు కనిపించడం లేదా అని మంత్రి ప్రశ్నించారు.వకీల్‌సాబ్‌కు వకాల్తా పుర్చుకున్నప్పుడు లోకేష్‌కు కరోనా గుర్తు రాలేదా అని నిలదీశారు. లోకేష్ వ్యాఖ్యలు రెచ్చగొట్టేలా ఉన్నాయని మంత్రి ఆదిమూలపు సురేష్ మండిపడ్డారు.