ఏపీఐఐసీ చైర్మన్‌గా మెట్టు గోవింద్‌రెడ్డి ప్రమాణ స్వీకారం
11 Aug, 2021 13:33 IST
విజయవాడ: ఏపీఐఐసీ చైర్మన్‌గా మెట్టు గోవింద్‌రెడ్డి పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయంలో పలువురు ఆయన్ను కలిసి అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు తనకు చైర్మన్ పదవి ఇవ్వడం పట్ల సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డికి గోవింద్‌రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. పరిశ్రమల అభివృద్ధికి అందరి సహకారంతో కృషి చేస్తానని పేర్కొన్నారు.