సంతమాగులూరు జంక్షన్లో జనహోరు
10 Apr, 2024 12:15 IST

పల్నాడు: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్రయాత్రలా సాగుతోంది. అడుగడుగునా అభిమానం అడ్డుపడుతూ..జననేతను చూడాలని, ఆయనతో కరచాలనం చేయాలని, ఫోటో దిగాలని ప్రజలు తండోపతండాలుగా కదిలివస్తున్నారు. ఇవాళ సంతమాగులూరుకు చేరుకున్న సీఎం వైయస్ జగన్కు స్థానికులు ఘన స్వాగతం పలికారు. గుమ్మడికాయలతో దిష్టి తీసి, పూలవర్షం కురిపించారు. సంతమాగులూరు అడ్డరోడ్డు( జంక్షన్) జనంతో పోటెత్తింది.ముఖ్యమంత్రి వైయస్.జగన్ బస్సుయాత్రకు భారీగా ప్రజలు తరలివచ్చారు. పెద్దసంఖ్యలో రోడ్డుకు ఇరువైపులా మహిళలు చిన్నారులతో సహా బారులు తీరారు. సీఎం వైయస్ జగన్ బస్సుపైకి ఎక్కి ప్రజలకు అభివాదం చేశారు.