మహిళల భద్రతకు సీఎం వైయస్ జగన్ పెద్ద పీట
3 Mar, 2020 18:52 IST
కృష్ణా : మహిళల భద్రతకు ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి పెద్దపీట వేశారని హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. మచిలీపట్నంలో దిశ పోలీస్ స్టేషన్‌ను మంగళవారం మంత్రి సుచరిత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామాల్లో విధుల్లో ఉన్న మహిళా పోలీసులు దిశ చట్టం గురించి, మహిళల రక్షణ గురించి ప్రతి ఒక్కరికి వివరించాలన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పేర్నాని, కొడాలి నాని, మహిళా చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ, ఎమ్మెల్యే మొండితోక జగన్‌మోహన్‌రావు, రక్షణనిధి, వల్లభనేని వంశీ, కైలే అనిల్‌కుమార్, నాగేశ్వరరావు, సింహాద్రి రమేష్ పాల్గొన్నారు.