మదనపల్లిలో పార్టీ కమిటీల డిజిటలైజేషన్‌పై సమావేశం
7 Apr, 2026 13:57 IST
అన్నమయ్య జిల్లా: మదనపల్లి నియోజకవర్గ కార్యాలయంలో పార్టీ కమిటీల డిజిటలైజేషన్, వెరిఫికేషన్ ప్రక్రియపై ముఖ్య సమావేశం నిర్వహించబడింది. సోషల్ మీడియా, ఐటీ వింగ్, యూత్ వింగ్ ప్రతినిధులు పాల్గొని కార్యాచరణపై చర్చించారు. ఈ సమావేశానికి నియోజకవర్గ సమన్వయకర్త నిసార్ అహ్మద్, అబ్జర్వర్ అనూష రెడ్డి, యువజన విభాగం అధ్యక్షుడు హర్షవర్ధన్ రెడ్డి, ఇంటలెక్చువల్ ఫోరం సెక్రటరీ వి.ఎస్. రెడ్డి తదితరులు హాజరయ్యారు.
పార్టీ బలోపేతానికి డిజిటల్ డేటా నిర్వహణ కీలకమని, ప్రతి స్థాయిలో కమిటీలను సమర్థంగా వ్యవస్థీకరించేందుకు ఈ ప్రక్రియ ఉపయోగపడుతుందని నేతలు పేర్కొన్నారు. అలాగే, డిజిటలైజేషన్ ద్వారా కార్యకర్తల వివరాలు సక్రమంగా నమోదు చేసి, భవిష్యత్ కార్యాచరణను మరింత సమర్థంగా అమలు చేయాలని సూచించారు.