శ్రీశంకర విజయేంద్ర సరస్వతి స్వామిని దర్శించుకున్న విష్ణు

19 Aug, 2025 14:44 IST

తిరుప‌తి: రాష్ట్ర సంక్షేమం కోసం వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తలపెట్టిన కార్యక్ర మాలన్నీ విజయవంతం కావాలని కోరుతూ తిరుపతిలో చాతుర్మాస దీక్షలో ఉన్న పరమా చార్య శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి మహా స్వామిని మాజీ ఎమ్మెల్యే, వైయ‌స్ఆర్‌సీపీ సెంట్రల్ నియోజకవర్గం సమన్వయకర్త మల్లాది విష్ణు కుటుంబ సమేతంగా దర్శిం చుకున్నారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు కుటుంబ సభ్యులకు కంచి పరమాచార్య స్వామి ఆశీస్సులు అందజేశారు.