నూతన మెకనైజ్డ్ బోట్ ప్రారంభం
29 Oct, 2022 11:38 IST
కాకినాడ: కాకినాడ పోర్టులో నూతన మెకనైజ్డ్ బోట్‌ను మంత్రి సీదిరి అప్పలరాజు ప్రారంభించారు. ఉప్పాడ తీర ప్రాంతం పర్యటనలో భాగంగా ఆయన బోటును ప్రారంభించి, పలు అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షించారు. కార్యక్రమంలో ఎంపీ వంగా గీతా, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.