విద్యార్థినులను వేధించిన పీడీపై చర్యలు తీసుకోవాలి
29 Dec, 2025 15:37 IST
అనంతపురం: విద్యార్థినులను వేధించిన కేఎస్ఎన్ డిగ్రీ కాలేజీ పీడీపై చర్యలు తీసుకోవాలని వైయస్ఆర్ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ యాదవ్ డిమాండ్ చేశారు. కేఎస్ఎన్ డిగ్రీ కళాశాల విద్యార్థినీలు తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. కళాశాల పీడీ వ్యవహారంపై సమగ్ర విచారణ చేపట్టి, బాధ్యుడిని సస్పెండ్ చేయాలని విద్యార్థినీలు డిమాండ్ చేశారు. పీడీ ప్రవర్తన వల్ల తాము తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నామని, న్యాయం జరగకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని విద్యార్థినీలు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైయస్ఆర్‌సీపీ విద్యార్థి విభాగం నగర అధ్యక్షులు కైలాష్, జిల్లా ప్రధాన కార్యదర్శి అశోక్ పాల్గొన్నారు.