పవన్ కల్యాణ్‌వి కమర్షియల్ పాలిటిక్స్
10 May, 2024 12:07 IST
పశ్చిమ గోదావరి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై మంత్రి కొట్టు సత్యనారాయణ సైటైర్లు వేశారు. పవన్ కల్యాణ్‌వి కమర్షియల్ పాలిటిక్స్ అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఇచ్చే డబ్బుల కోసమే పవన్ పని చేస్తున్నారని విమర్శించారు. ఏ గొడవ జరిగినా జనసేన కార్యకర్తలు ఉంటున్నారు. జిల్లాలో ప్రశాంతతను దెబ్బతీస్తున్నారని మంత్రి కొట్టు సత్యనారాయణ మండిపడ్డారు. తీరు మార్చుకోకపోతే ప్రజలు ఓటుతో గట్టిగా బుద్ధి చెబుతారని హెచ్చరించారు.