ప్రతి కార్యకర్త ఒక సైనికుడిలా పని చేయాలి
నంద్యాల జిల్లా : ప్రతి వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్త ఒక సైనికుడిలా పనిచేయాలని బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పిలుపునిచ్చారు. బనగానపల్లె నియోజకవర్గం గ్రామ పంచాయతీ పరిశీలకుల నియామక సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గ్రామస్థాయి నుంచే పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. పార్టీ కోసం ఇప్పుడు కష్టపడే ప్రతి కార్యకర్తకు రానున్న రోజుల్లో తగిన గుర్తింపు తప్పక లభిస్తుందని భరోసా ఇచ్చారు. పార్టీ ఆదేశించే ప్రతి కార్యక్రమాన్ని సమిష్టిగా, క్రమశిక్షణతో విజయవంతం చేయాలని, కార్యకర్తలే పార్టీకి అసలైన బలమని కాటసాని రామిరెడ్డి స్పష్టం చేశారు. ఈ సమావేశానికి వైయస్‌ఆర్‌సీపీ పార్టీ రాష్ట్ర యువజన విభాగ ప్రధాన కార్యదర్శి కాటసాని ఓబుల్ రెడ్డి , నాయకులు గుండం సూర్య ప్రకాశ్ రెడ్డి, గుండం నాగేశ్వర్ రెడ్డి, సిద్ధంరెడ్డి రామ్మోహన్ రెడ్డి, అబ్దుల్ ఫైజ్, బీవీ నాగార్జున రెడ్డి, చిన్నబాబు, లాయర్ మహేశ్వర్ రెడ్డి, హరినాథ్ రెడ్డి, అంబటి రవి రెడ్డి, కానాల రవిరెడ్డి, అనిల్‌తో పాటు వైయస్‌ఆర్‌సీపీ గ్రామ పంచాయతీ పరిశీలకులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.