తూర్పు నుంచే మార్పు మొదలవుతుంది

11 Mar, 2019 16:17 IST

తూర్పుగోదావరి: తూర్పు నుంచే మార్పు ప్రారంభమవుతుందని వైయస్‌ఆర్‌సీపీ నేత కురసాల కన్నబాబు అన్నారు. కాకినాడలో జరుగుతున్న వైయస్‌ఆర్‌సీపీ సమర శంఖారావం సభలో ఆయన మాట్లాడారు. కాకినాడలో జరుగుతున్న వైయస్‌ఆర్‌సీపీ సమర శంఖారావం సభ ఎన్నికల షెడ్యూల్‌ వచ్చిన తర్వాత మెట్టమొదటి ఎన్నికల సభగా మారడం అనేది దైవ సంకల్పంగా తెలిపారు.చంద్రబాబు జిమ్మికులు చేస్తున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు ఊపిరి పిల్చుకోవాలని, వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి కాబోతున్నారన్నారు. చంద్రబాబు దురాగతాలను  ప్రజలు పుల్‌స్టాప్‌ పెడతారన్నారు.