టీడీపీ నుంచి వైయస్ఆర్‌సీపీలో చేరిక
24 Feb, 2024 13:01 IST
ఎన్టీఆర్ జిల్లా: ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీకి ఎన్టీఆర్ జిల్లాలో వరుస షాకులు తగులుతున్నాయి. తాజాగా జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన మాతంగి సైదేశ్వరవు, మాడుగుల యాకోబు, బుడుగు శామ్యూల్, టీడీపీని వీడి వైయస్ఆర్‌సీపీలోకి చేరారు. వీరికి రాష్ట్ర ప్రభుత్వవిప్, శాసనసభ్యులు సామినేని ఉదయభాను కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని ప్రభుత్వవిప్ సామినేని ఉదయభాను అన్నారు.