యువకుడిపై విచక్షణారహితంగా దాడి
30 Mar, 2025 18:38 IST
ప్రకాశం జిల్లా: యర్రగొండపాలెంలో పోలీస్ స్టేషన్ పక్కన ఎస్సి సామాజికవర్గానికి చెందిన రాజేష్ అనే యువకుడిపై టీడీపీ గూండాలు విచక్షణారహితంగా దాడి చేసి తల పగలగొట్టారు. దీంతో రాజేష్‌ను తీవ్ర గాయాలతో యర్రగొండపాలెం ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. ఈ మేరకు పోలీస్ స్టేషన్ లో బాధితుడు ఫిర్యాదు చేసిన పోలీసులు కేసు నమోదు చేయకుండా రాజీ చేసుకోవాలని ఉచిత సలహా ఇవ్వడం పట్ల ఎమ్మెల్యే తాటిపత్రి చంద్రశేఖర్ మండిపడ్డారు.