గ్రావెల్ అనకొండ చినరాజప్పే
31 Jul, 2023 12:20 IST
తూర్పు గోదావరి జిల్లా: టీడీపీ నేత చినరాజప్ప గ్రావెల్ అనకొండ అని వైయస్‌ఆర్‌సీపీ నాయకుడు, హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దవులూరు దొరబాబు విమర్శించారు. చెరువులను కబ్జా చేసిన వ్యక్తి చినరాజప్ప అని ధ్వజమెత్తారు. పెద్దాపురం నియోజకవర్గంలోని ఆనూరుమెట్ట మట్టి తవ్వకాలపై వైయస్‌ఆర్‌సీపీ నాయకుడు దొరబాబుపై మాజీ మంత్రి చినరాజప్ప చేసిన ఆరోపణలను నిరసిస్తూ వైయస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేపట్టారు. నిజాయితీని నిరూపించుకునేందుకు తాను లైడిటెక్టర్ పరీక్షకు సిద్ధమని దొరబాబు సవాలు విసిరారు.