ఉధృక్త పరిస్థితుల దృష్ట్యా బాబును ఆపాం
29 Feb, 2020 14:20 IST
గుంటూరు: విశాఖలో చంద్రబాబు పర్యటనకు అనుమతిచ్చామని, అయితే విశాఖలో ఉధ్రిక్త పరిస్థితుల దృష్ట్యా చంద్రబాబును ఆపామని రాష్ట్ర హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. విశాఖలో చంద్రబాబును అరెస్టు చేయలేదని తెలిపారు. అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై సిట్ విచారణ జరుగుతోంది. త్వరలో అవినీతికి పాల్పడ్డ వారి పేర్లు బయటకు వస్తాయి.