భవానీని అభినందించిన వైయస్ జగన్
7 Jul, 2025 13:07 IST
తాడేపల్లి: విజయనగరం జిల్లా కొండకరకాం గ్రామానికి చెందిన వెయిట్ లిఫ్టర్ రెడ్డి భవానీకి వైయస్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అభినందలు తెలిపారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో వైయస్ జగన్ భవానీకి శుభాకాంక్షలు తెలుపుతూ సందేశం పంపారు. కజకిస్థాన్లో ఇటీవల జరిగిన ఏషియన్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ పోటీల్లో భవానీ మూడు బంగారు పతకాలు సాధించిన సంగతి తెలిసిందే. ఆమెకు వైయస్ జగన్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సొంతం చేసుకోవాలని.. ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని వైయస్ జగన్ ఆకాంక్షించారు.