నాలుగో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

26 Sep, 2023 10:14 IST

అమరావతి: నాలుగో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఉదయం 9 గంటలకు మొదలైన అసెంబ్లీలో ఫైబర్ గ్రిడ్ కుంభకోణం పై చర్చించనున్నారు. అనంతరం వ్యవసాయ రంగంపై చర్చ జరగనుంది. ఇక శాసనమండలిలో స్కిల్ డెవెలప్‌మెంట్‌ స్కామ్‌పై సభ్యులు చర్చించనున్నారు. విద్యారంగంపైనా చర్చ జరగనుంది. ప్ర‌స్తుతం అసెంబ్లీలో క్వశ్చన్‌ అవర్ కొన‌సాగుతోంది.